బాబా సాహెబ్ డా,బి.ఆర్ అంబెడ్కర్ జయంతి సందర్భంగా కాశీబుగ్గ జంక్షన్ లో మహనీయునికి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే నరేందర్

బాబా సాహెబ్ డా,బి.ఆర్ అంబెడ్కర్ జయంతి సందర్భంగా కాశీబుగ్గ జంక్షన్ లో మహనీయునికి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే నరేందర్

వరంగల్,అక్షిత బ్యూరో : డా.బి.ఆర్ అంబెడ్కర్ జయంతి సందర్భంగా కాశీబుగ్గ జంక్షన్ లో మహనీయునికి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే ఈ సందర్భంగా మాట్లాడుతూ అంబెడ్కర్ కలలు కన్న సమానత్వం,సామాజిక న్యాయాన్ని పేదప్రజల అభివృద్దే ద్యేయంగా బిఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు
ఆనాడు అంబెడ్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 3 వల్లనే మనం కేసిఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ నూతన రాష్ట్రాన్ని ఏర్పరుచుకున్నమని గుర్తు చేశారు భారతదేశంలో అంబెడ్కర్ కి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదని గుర్తించి నేడు తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి డా.బీ.ఆర్ అంబెడ్కర్ పెరు పెట్టుకుని ఆ మహానియుణ్ణి నిరంతరం స్మరించుకుంటున్నామన్నారు ఈ రోజు ఆ మహనీయుని 125 అడుగుల విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డున ఏర్పాటు చేసుకొని నేడు ఆవిష్కరించుకోబోతున్నామని ఎమ్మెల్యే తెలిపారు.
అంబెడ్కర్ సబ్బండవర్గాలకు ఆదర్శప్రాయుడు ఆ మహానుభావుడని చేసినటువంటి కృషే నేడు రిజర్వేషన్ల రూపంలో సబ్బండ వర్గాలకు న్యాయం జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు కార్యక్రమం లి అంబేడ్కర్ వాదులు ప్రజా ప్రతనిధులు అదికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking