అంబేద్కర్ జీవితం అట్టడుగు వర్గాల జీవితాల్లో వెలుగు కిరణం. కార్పొరేటర్ కావటి కవిత రాజు యాదవ్
వరంగల్,అక్షిత బ్యూరో : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 132వ జయంతిని దేశాయిపేట 12వ డివిజన్ ఎస్సార్ భవన్ లో ట్యానరీ, లెదర్ వర్కర్స్ యూనియన్ అధ్వర్యంలో యూనియన్ అధ్యక్షులు కోత్తూరి యకేందర్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 12వ డివిజన్ కార్పొరేటర్ కావటి కవిత రాజు యాదవ్,మాజీ వేజ్ బోర్డ్ చైర్మన్ జన్ను జకారియ విచ్చేసి అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. తదనంతర కావటి కవిత రాజు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని రూపొందించడంలో అంబేడ్కర్ చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు.
స్వతంత్ర సమరయోధుడు, సమాజంలో ఆధిపత్య ధోరణులపై అంబేద్కర్ అలుపెరుగని పోరాటం చేశారన్నారు. వివక్షని రూపుమాపడానికి జీవితాంతం ఓ యుద్ధమే చేశారన్నారు. స్వేచ్ఛా, సమానత్వం, పౌరహక్కులు రాజ్యాంగం ద్వారా కల్పించిన మానవతామూర్తి అంబేద్కర్ మహాశయుడి ఆశయసాధనకి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. వివక్ష, పేదరికం లేని సమాజం నిర్మించుదామని కావటి కవిత అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు జన్ను దయాకర్,కొడేపాక రాజు, జన్ను సుశిరాజ్,ఆఫ్రోజ్, జన్ను అనిల్ కుమార్, జోషి, యాకూబ్, దావీద్, కార్మికులు,పాల్గొన్నారు.