ఘనంగా డా.. బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు..
వరంగల్,అక్షిత బ్యూరో : జిల్లాకు చెందిన సేవా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు నిర్వహించినట్లు సంస్థ వ్యవస్థాపకుడు జూపాక రత్న ప్రణయ్ తెలిపారు.కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఫోరం ఫర్ ఛైల్డ్ రైట్స్ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ పాలడుగుల సురేందర్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం ముఖ్యంగా దళితుల అభివృద్ధి కోసం అంబేద్కర్ ఎంతగానో కృషి చేశారని యావత్ భారత దేశ ప్రజల శ్రేయస్సు కోసం భారత రాజ్యాంగం నిర్మించారని భవిష్యత్తు తరాల వారి కోసం అంబేడ్కర్ ఆశయ సాధన కోసం భాద్యతగా మనవంతు కృషి చేయాలని కోరారు.కార్యక్రమంలో సంస్థ ప్రదాన కార్యదర్శి అయిత ఉషాభాస్కర్ కోశాధికారి ప్రదీప్ కమిటీ సభ్యులు దూలం సందీప్ రాజేష్ అజయ్ ప్రేమ్ రాజేందర్ జోయల్ ప్రకాష్ తదితరులు పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు…