ఇంధనీ గ్రామ పంచాయితీలో ఘనంగా డాక్టర్ బీ.అర్ అంబేద్కర్ జయంతి వేడుకలు బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి & ఆలయ ఫౌండేషన్ జిల్లా ఇంఛార్జి కోట్నక విజయ్ కుమార్
ఇంధనీ గ్రామ పంచాయితీలో ఘనంగా డాక్టర్ బీ.అర్ అంబేద్కర్ జయంతి వేడుకలు
బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి & ఆలయ ఫౌండేషన్ జిల్లా ఇంఛార్జి కోట్నక విజయ్ కుమార్
ఆదిలాబాద్, అక్షిత బ్యూరో:
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ఇంధని గ్రామ పంచాయతీ చౌక్ లో డాక్టర్ బి. అర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి & అలయ ఫౌండేషన్ జిల్లా ఇంఛార్జి కోట్నక విజయ్ కుమార్ ముందుగా డాక్టర్ బి అర్ అంబేద్కర్ విగ్రహనికి పూలమాలలు వేసి అనంతరం మాట్లడుతూ దళిత వర్గానికి చెందిన ఆయన తన జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు. దళితుడైన కారణంగా అంబేడ్కర్ను అంటరానివాడిగా చూసేవారు. స్కూల్కు వెళ్లినా వేర్వేరుగా కూర్చోవల్సిన పరిస్థితి. ఒక్కోసారి క్లాస్రూమ్లోనే కూర్చోనిచ్చేవారు కాదు.

ఇన్ని కష్టాల మధ్య అంచెలంచెలుగా ఎదిగిన అంబేడ్కర్.. ఒక గొప్ప ఎకనామిస్ట్గా, జ్యూరిస్ట్గా, సామాజిక కార్యకర్తగా, రాజకీయ నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. భారత రాజ్యాంగాన్ని రచించిన కమిటీకి నాయకత్వం వహించిన ఘనత అంబేడ్కర్ సొంతం. ఆయన జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం ఆని అంబేద్కర్ దేశంలోని వెనుకబడిన వర్గాలు ఎదుర్కొంటున్న సామాజిక అన్యాయాలను నిరసించాడు. దళితులు ఎదుర్కొంటున్న కష్టాలను ఆయన తన ప్రముఖ వ్యాసం- “నో ప్యూన్, నో వాటర్”లో ఎత్తిచూపారు. అంబేద్కర్‌కు తాగునీరు నిరాకరించిన సందర్భాన్ని ఎస్సై గుర్తు చేసుకున్నారు. దళిత హక్కుల పరిరక్షణ కోసం భారత ప్రభుత్వం మార్చి 31, 1995న అట్రాసిటీ నిరోధక (POA) చట్టాన్ని రూపొందించింది ఆని అన్నారు….
భీమ్‌రావ్ అంబేడ్కర్.. న్యాయవాదిగా, ఆర్థిక వేత్తగా, రాజకీయ వేత్తగా, రాజ్యాంగ నిర్మాతగా అన్నిటికి మించి సామాజిక సంస్కర్తగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం. అంటరానితనంపై అలుపెరగని పోరు చేశారాయన. దళితులు, గిరిజనులు, మహిళలు, కార్మికుల హక్కుల కోసం అవిశ్రాంత కృషి చేసిన మహనీయుడాయన
సమాజంలోని అన్ని వర్గాలకు సర్వసత్తాక సార్వభౌమాధికారం ఉండాలంటూ రాజ్యాంగాన్ని రూపొందించారాయన. అలాంటి మహనీయుడి జయంతి నేడు (ఏప్రిల్ 14). ఈ సందర్భంగా రాజకీయాలకు అతీతంగా అంబేడ్కర్ చేసిన సేవలను అందరూ స్మరించుకుంటున్నారు ఆని అందుకే జయంతి వేడుకలను దేశ వ్యాప్తంగా మరియు ప్రపంచ వ్యాప్తంగా వేడుకలు జరుపుకుంటున్నారు. ఆని అన్నారు
ఈ కార్యక్రమంలో ఆయనతో పాటూ గ్రామ పంచాయితీ ఉప సర్పంచ్ నగోసే రమేష్, గ్రామా పటెల్ నగోసే హనుమంతు, బిల్లా రావు, దుర్గం వెంకటి, మహాత్మే పాండు, బిజెపి ఎస్టీ మోర్చ జిల్లా కోశదికారి పెందుర్ మారుతి, సర్పంచ్ భీమయ్య మరియు బిజేపి నాయకులు కార్యకర్తలు అభిమానులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు