అట్టడుగు వర్గాలకు ఆశ్రయం కల్పించిన ఆరాధ్యుడు అంబేడ్కర్,చిరు వ్యాపారులు సంఘం వరంగల్ ,అక్షిత బ్యూరో : దేశాయిపేటకు గ్రామానికి చెందిన మైదానం వద్ద చిరు వ్యాపారం చేసుకుంటున్న వ్యాపారులంతా కలిసి నూతనంగా అంబేద్కర్ చిరు వ్యాపారుల సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు.ప్రదానంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతి రోజును పురస్కరించుకుని చిరు వ్యాపారులంతా కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అంబేద్కర్ జయంతి రోజునే ఆయనే పేరు మీదనే చిరువ్యాపారుల సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం ఉందని అంబేద్కర్ ఆశయ సాధన కోసం తామంతా కలిసి కట్టుగా కృషి చేస్తామని చిరు వ్యాపారులు తెలిపారు.కార్యక్రమంలో సామాజిక వేత్త డాక్టర్ పాలడుగుల సురేందర్ జూపాక రత్న ప్రణయ్ అయిత ఉషాభాస్కర్ చిరు వ్యాపారస్తులు ఆమోస్ నూతన్ బాబు సునీల్ గణపతి తదితరులు పాల్గొన్నారు…