రాజ్యాంగాన్ని కాపాడి పూర్తి స్థాయిలో అమలు పరచడమే బీఎస్పీ లక్ష్యం * బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ * ఘనంగా అంబేద్కర్ జయంతి,బీఎస్పీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
రాజ్యాంగాన్ని కాపాడి పూర్తి స్థాయిలో అమలు పరచడమే బీఎస్పీ లక్ష్యం
* బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్
* ఘనంగా అంబేద్కర్ జయంతి,బీఎస్పీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
భద్రాద్రి కొత్తగూడెం అక్షిత ప్రతినిధి:
భారత రాజ్యాంగాన్ని కాపాడి పూర్తిస్థాయిలో అమలు పర్చడమే బీఎస్పీ లక్ష్యమని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ అన్నారు. శుక్రవారం అంబేద్కర్ 132వ జయంతిని, బీఎస్పీ 39వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ కార్యాలయం వద్ద శుక్రవారం జెండా ఆవిష్కరణ చేశారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కామేష్ మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా సకల జనులకు ప్రాథమిక హక్కులు అదేశిక సూత్రాలతో సమాన హక్కులను రాజ్యాంగ ఫలాలు అందించారని కొనియాడారు. భారత దేశంలో అశోక చక్రం పరిపాలనే బీఎస్పీ అంతిమ లక్ష్యమని దానికి భారత రాజ్యాంగమే ఎజెండా అంశంగా ఈ దేశ సంపదను వనరులను భూమిని సమస్త ప్రజలకు సమానంగా పంపిణీ చేయడమే అంబేద్కర్ ఆశయమని దాని కొరకు ఏ పార్టీ కూడ సాహసం చేయలేని విధానాన్ని పసిగట్టి బహుజనులందరికి న్యాయం జరగాలంటే భారత రాజ్యాంగమే ఎజెండా ఉండాలని ప్రకటించుకున్న ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయి, నాగుల రవికుమార్, మాలోత్ వీరు నాయక్, చెనిగారపు నిరంజన్ కుమార్, మాలవత్ పూర్ణ తదితరులు పాల్గొన్నారు.
పాల్వంచలో….
దేశంలో సగ భాగమైన మహిళలకు విద్య ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించిన మహిళల పక్షపాతి అంబేద్కర్ అని బహుజన్ సమాజ్ పార్టీ యెర్రా కామేష్ కొనియాడారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని పార్టీ కార్యాలయం ఎదుట అయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. అంబేద్కర్ కష్టపడి రాజ్యాంగాన్ని రచించారని యువత అయన ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పాల్వంచ పట్టణ అధ్యక్షుడు కోళ్ళపూడి ప్రవీణ్ కుమార్, అసెంబ్లీ మహిళా కన్వీనర్ కోలా మల్లికా, పట్టణ కార్యదర్శి కేతిని కుమారి, మర్థమ్మ, ఎర్రంశెట్టి రాజేశ్వరి, సరోజ తదితరులు పాల్గొన్నారు.