అప్పుల బాధ బరించలేక రైతు ఆత్మ హత్య
మద్దూరు అక్షిత న్యూస్:
మండలంలోని కూటిగల్ గ్రామానికీ చెందిన నల్ల ఉప్పలయ్య ( 55) అనే రైతు అప్పుల బాధ బరించలేక గురువారం మద్యంతో పురుగుల మందు సేవించి అత్మ హత్యకు పాల్పడిన సంఘటన జరిగింది.శుక్రవారం గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం కూటిగల్ గ్రామానికీ చెందిన అతి బీద కుటుంబానికి చెంది వ్యవసాయంతో పాటు కూలి పనులు చేసుకుంటూ జీవనం గడుపుతున్న క్రమంలో పెళ్లికి ఎదిగిన కూతురు వివాహం చేసేందుకు ఆన్ని చోట్ల అప్పుల కొసం తిరిగి తిరిగి కూతురు వివాహం చేయలేనేమొనని జీవితంపై విరక్తి చెంది పురుగుల మందు సేవించి ఆత్మ హత్య చేసుకున్నట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు భార్య సుశీల ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.శవాన్ని పోస్టు మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు