శిబ్బితండాలో అంగన్వాడి భవనం నిర్మించాలి.
అధికారులకు తండా వాసుల వేడుకలు
మద్దూరు అక్షిత న్యూస్:
మండలంలోని హన్మ తండా పరిధిలోని శిబ్బి తండాలో అంగన్వాడి నూతన భవనం నిర్మించాలనీ తండా వాసులు అధికారులను కోరుతున్నారు.ఈ సందర్బంగా వారు ప్రజా తీర్పు ప్రతినిధితో మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఓ ప్రైవేట్ ఇళ్లు అద్దె తీసుకొని కాలం వెళ్ళబుచ్చుకుని పిల్లలకు విద్యతొ పాటు పౌష్ఠిక ఆహారం అందించిన ఇరుకు గదిలో పిల్లలకు ఇబ్బంది కరంగా ఉందన్నారు.ఈ నేపథ్యంలో ఇంటి యజమాని అంగన్వాడి ఖాళీ చేయాలని తెలుపడంతొ ఎక్కడ అద్దె భవనాలు దొరికాక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.తక్షణమే అదికారులు స్పందించి ప్రభుత్వ నిధుల ద్వార నూతన అంగన్వాడి భవనం నిర్మించి తండా వాసుల పిల్లలను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.