గాలివాన బీభత్సం.. గాల్లోకి ఎగిరిపడ్డ వ్యక్తి వెల్లడించిన భయంకర నిజాలు
అక్షిత బ్యూరో
ఉత్తర్ ప్రదేశ్‌లో గాలివాన బీభత్సం సృష్టించింది. ఉరుములు మెరుపులు పిడుగులతో కురిసిన వర్షానికి 100 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఇక, బరేలీ జిల్లాలో బలమైన ఈదురు గాలులకు ఓ వ్యక్తి ఎగిరిపడ్డాడు. గాలిదుమారంతో సదరు వ్యక్తి ఓ షెడ్డును పట్టుకుని వేలాడాడు. కానీ, దాని తీవ్రతకు షెడ్డుతో సహా అతడు ఎగిరిపోయాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనలో గాయపడిన బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు