చలివేంద్రం ఏర్పాటుకు చేయూతనిచ్చిన చిట్యాల సహకార సంఘాలు

చలివేంద్రం ఏర్పాటుకు చేయూతనిచ్చిన చిట్యాల సహకార సంఘాలు

చిట్యాల అక్షిత ప్రతినిధి: చిట్యాల ఆర్యవైశ్య సంగం,వాసవిక్లబ్, వణితక్లబ్ ల ఆధ్వర్యంలో చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని ఎమ్ ఎన్ రెడ్డి ఫంక్షన్ హాల్ ముందు చలివేంద్రం ప్రారంభించినారు. నల్లగొండ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు వనమా వెంకటేశ్వర్లు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. వారు మాట్లాడుతూ క్రితం ఏడాది కంటే ఈ ఏడాది ఎండలు ఎక్కువగా ఉండడంతో చుట్టుపక్కల ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ ప్రజలందరూ ఈ చలివేంద్రాన్ని ఉపయోగించుకోవాలని కోరారు ఎండకు బయటకు వెళ్ళినప్పుడు క్యాప్ గాని టవల్ గాని తలకు పెట్టుకోవాలని సూచించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులు గా నల్లగొండ జిల్లా మహిళా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షురాలు పందిరి గీత , చిట్యాల మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తెరటు పల్లి హనుమంతు చిట్యాల పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు వాసా విద్యాసాగర్, వనితాక్లబ్ మహిళా అధ్యక్షురాలు వనమా హైమా అరుంధతి, వాసవి క్లబ్ అధ్యక్షులు పొద్దుటూరు శ్రీనివాస్ శివాలయం చైర్మన్ రంగా వెంకన్న, కనకదుర్గ గుడి చైర్మన్ శీల సత్యనారాయణ, వాసవి క్లబ్ పి ఎస్ టి లు ఉమా శంకర్, మరియు ఇమ్మడి వెంకన్న ఆర్యవైశ్య సంఘం జిల్లా నాయకులు బుస్సా శ్రీనివాసులు ఆర్యవైశ్య సంఘం పట్టణ యువజన అధ్యక్షులు వనమా ప్రవీణ్ , వనమా మౌనిక ఆర్యవైశ్య సంఘం టౌన్ సెక్రటరీ జయారపుశివప్రసాద్, వేలుపల్లి రవీందర్, వేలుపల్లి వెంకటేశ్వర్లు, జగిని వెంకన్న ,అల్లాని ఆనంద్ , ఆర్యవైశ్య సంఘం సభ్యులు వాసవి క్లబ్ క్లబ్ సభ్యులు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. అందరూ కూడా ఈ చలివేంద్రాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking