హిందూ మతోన్మాదానికి వ్యతిరేకంగా ఉద్యమించాలి డాక్టర్ అంబేద్కర్ కామ్రేడ్ జార్జిరెడ్డిలకు, కొవ్వొత్తుల నివాళి
హిందూ మతోన్మాదానికి వ్యతిరేకంగా ఉద్యమించాలి
డాక్టర్ అంబేద్కర్ కామ్రేడ్ జార్జిరెడ్డిలకు, కొవ్వొత్తుల నివాళి
వరంగల్,అక్షిత బ్యూరో: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి, పి డి ఎస్ యు ఉద్యమ నిర్మాత కామ్రేడ్ జార్జి రెడ్డి 51 వ వర్ధంతి ని శుక్రవారం రాత్రి పి డి ఎస్ యు పూర్వ విద్యార్థుల కమిటీ ఆధ్వర్యంలో ఖిలా వరంగల్ లోని పడమరకోట చమన్ సెంటర్లో జరిపారు.ముందుగా ఖిలా వరంగల్ మెట్టు దర్వాజ నుండి కొవ్వొత్తులతో ప్రారంభమైన ర్యాలీ డప్పు చప్పుళ్ళతో చమన్ సెంటర్ వరకు జరిగింది ఈ ర్యాలీలో పాల్గొన్న నాయకులు కార్యకర్తలు బాబాసాహెబ్ అంబేద్కర్ కు జార్జి రెడ్డికి జోహార్లు, రాజ్యాంగ ప్రజాస్వామ్య హక్కులను కాపాడుకుందాం .హిందూ మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడుదాం అని నినాదాలు చేశారు . దేశవ్యాప్తంగా దళితులపై ఆదివాసీలపై మైనారిటీలపై జరుగుతున్న హిందూ మతోన్మాద దాడులను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు డాక్టర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగమును మార్చేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని దీనివల్ల దళితులు ఆదివాసులు ఇతర బలహీన వర్గాలు వారి హక్కులను కోల్పోవాల్సి వస్తుందని తెలుపుతూ మోడీ ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా కలిసికట్టుగా ఉద్యమించాలని వారు అన్నారు
ఉస్మానియా యూనివర్సిటీ అరుణతార ఇండియన్ ఐన్ స్టీన్ గా ప్రసిద్ధి పొందిన కామ్రేడ్ జార్జి రెడ్డి ఓ యు క్యాంపస్ లో ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ గుండాల దౌర్జన్యాలను ఎదిరించి నిలబడ్డందున 1972 ఏప్రిల్ 14న గూండాలు హత్య చేశారని వారు తెలిపారు కామ్రేడ్ జార్జి అమరత్వం చెందడమే గాక దేశ విద్యార్థి ఉద్యమాల్లోవిప్లవ విద్యార్థి ఉద్యమాన్ని నిర్మించడానికి ప్రేరణగా నిలిచాడని వారు పేర్కొన్నారు నేడు పెరుగుతున్న హిందూ ఫాసిజంకు వ్యతిరేకంగా లౌకిక ప్రజాస్వామ్య శక్తులతో కలిసి ఉద్యమాలు నిర్వహించాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని వారు గుర్తు చేశారు అనంతరం డాక్టర్ అంబేద్కర్ కు కామ్రేడ్ జార్జి రెడ్డికి అంబేద్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో నివాళులర్పించారు
ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యు పూర్వ నాయకులు నళిగంటి చంద్రమౌళి బండి కోటేశ్వరరావు తీగల జీవన్ బెల్లంకొండ రమేష్ రాచర్ల బాలరాజు సంగోజు రవి, గంగుల దయాకర్ బొడ్డు కుమార్ స్వామి గుర్రాల వెంకటేశ్వర్లు మైదం సంజీవ భైరబోయిన ఐలయ్య మైదం పాణి గండ్రాతి హరిబాబు ఇనుముల కృష్ణ మోహన్ ఎండి అక్బర్ తదితరులు పాల్గొన్నారు