సునార్కర్ రాంబాబుకు దళిత రత్న అవార్డు

సునార్కర్ రాంబాబుకు దళిత రత్న అవార్డు

మంచిర్యాల అక్షిత బ్యూరో:-

హైదరాబాదులోని రవీంద్రభారతిలో ఈనెల 14న నిర్వహించిన అంబేద్కర్ 132వ జయంతి ఉత్సవాలలో మందమర్రి పట్టణానికి చెందిన నేతకాని మహార్ సంక్షేమ సంఘం జిల్లా ఇంచార్జి సునర్కార్ రాంబాబు దళిత రత్న అవార్డు తీసుకోవడం జరిగింది. ఎస్సీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, అంబేద్కర్ ఉత్సవ కమిటీ వైస్ చైర్మన్ దుర్గం రాజేష్ లు సునార్కర్ రాంబాబును శాలువతో సన్మానించి, అవార్డు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత సునార్కర్ రాంబాబు మాట్లాడుతూ, దళితులకు అందిస్తున్న సేవలకు, జరుగుతున్న అన్యాయలపై చేస్తున్న పోరాటాలకు, నృత్య, కళా రంగంలో రాణిస్తున్న, తనను ఉత్సవ కమిటీ, ప్రభుత్వ గుర్తించి దళిత రత్న అవార్డు ఇవ్వడం సంతోషంగా ఉందని, తన సేవలు గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు, ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారులకు, ప్రభుత్వ యంత్రాంగానికి, ఉత్సవ కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking