చలివేంద్రం ఏర్పాటు హర్షనీయం
మంచిర్యాల, అక్షిత బ్యూరో:-
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం, రామకృష్ణాపూర్ పట్టణంలోని రెండవ వార్డు, జ్యోతి నగర్ కు చెందిన అంబాల రాము గత సంవత్సరం దహేగాం మండలంలోని పెసరకుంటలో రెస్క్యూ విధులు నిర్వహిస్తూ, వరదల్లో చిక్కుకున్న ప్రజలను కాపాడబోయే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు మరణించిన, అంబాల రాము జ్ఞాపకార్థం అతని త్యాగాన్ని స్మరిస్తూ, అతని మిత్ర బృందం రామాలయం చౌరస్తాలో అమరవీరుల స్తూపం వద్ద చలివేంద్రాన్ని ఏర్పాటు చేయగా, శనివారం రైట్ టు హెల్త్ ఫోరం అధ్యక్షులు, అడ్వకేట్ రాజలింగు మోతె సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కీర్తిశేషులు, అంబాల రాము జ్ఞాపకార్థం అతని మిత్రబృందం చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం చాలా హర్షనీయమన్నారు. ఈ చలివేంద్రాన్ని బాటసారులు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ
కార్యక్రమంలో చలివేంద్రం నిర్వాహకుడు ఆవుల రమేష్, డీజే ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోల శ్రీనివాస్, తెలంగాణ బలహీనవర్గాల సంక్షేమ సంఘం నాయకులు ఏల్పుల వెంకటస్వామి, మహేందర్, ముస్లిం మైనార్టీ సంఘం నాయకులు అసన్మియా తదితరులు పాల్గొన్నారు.