శంషాబాద్ అయ్యప్ప స్వామి దేవాలయంలో శనివారం మహా పడిపూజ కార్యక్రమం * హాజరైన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ చైర్మన్ వైస్ చైర్మన్ లు

శంషాబాద్ అయ్యప్ప స్వామి దేవాలయంలో శనివారం మహా పడిపూజ కార్యక్రమం
* హాజరైన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ చైర్మన్ వైస్ చైర్మన్ లు
రాజేంద్రనగర్ అక్షిత ప్రతినిధి: శంషాబాద్
మున్సిపల్ పరిధిలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్ప స్వామి జన్మదినం సందర్భంగా పడిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి ప్రకాష్ గౌడ్ అయ్యప్ప స్వామి దేవాలయంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు .ఈ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని ప్రజలందరి పైన అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆయన కోరుకున్నారు .ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలని ప్రజలకు అయ్యప్ప స్వామి మెండైన దీవెనలు ఉండాలని ఆశాభవాన్ని వ్యక్తం చేశారు .కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కొలన్ సుష్మ మహేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్, నార్సింగ్ మార్కెట్ కమిటీ చైర్మన్ దూడల వెంకటేష్ గౌడ్,ఆర్. గణేష్ గుప్తా, నీరటి రాజు ముదిరాజ్, మున్సిపల్ కౌన్సిలర్లు, కో ఆప్షన్ మెంబర్లు, మరియు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, యువనాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking