రోజువారీ లక్ష్యాన్ని సాధించాలి
మందమర్రి, అక్షిత ప్రతినిధి:-
సింగరేణి వ్యాప్తంగా నిర్దేశించుకున్న రెండు లక్షల 30 వేల టన్నుల రోజువారి ఉత్పత్తిని సాధిస్తూ, రవాణా సైతం జరగాలని సింగరేణి డైరెక్టర్ (ఆపరేషన్) ఎన్వికే శ్రీనివాస్, డైరెక్టర్ (ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్) వెంకటేశ్వర రెడ్డి లు సూచించారు. శనివారం వారు సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాలో జిఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్లు బొగ్గు ఉత్పత్తి, రవాణా, ఓపెన్ కాస్ట్ లలో మట్టి తొలగింపు వంటి విషయాలపై అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో ఏరియా జిఎం జి మోహన్ రెడ్డి, జిఎం కోఆర్డినేటర్స్, సంస్థ అడ్వైజర్లు, కార్పొరేట్ ఉన్నతాధికారులు, అన్ని ఏరియాల జిఎంలు, ఏరియా ఉన్నతాధికారులకు అధికారులు పాల్గొన్నారు.