వివోఏల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలి -రాష్ట్ర యునైటెడ్ మెడికల్ యూనియన్ అధ్యక్షులు ఫసియుద్దీన్ -3వ రోజుకుచేరుకున్న వివోఎల నిరవధిక సమ్మె
వివోఏల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలి -రాష్ట్ర యునైటెడ్ మెడికల్ యూనియన్ అధ్యక్షులు ఫసియుద్దీన్
-3వ రోజుకుచేరుకున్న వివోఎల నిరవధిక సమ్మె
అక్షిత తెలకపల్లి న్యూస్:
తెలకపల్లి వివోఎలన్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పసియొద్దిన్ అన్నారు. బుధవారం మండల కేంద్రం లో కొనసాగుతున్న సమ్మెకు మద్దతు ప్రకటించి వారు మాట్లాడారు. అనంతరం వివో ఏలు ఎంపీడీఓ కార్యాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీగా చేరుకొని డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి గోపాస్ లక్ష్మణ్ మాట్లాడుతు గత 3రోజులు నుండి వివోఏలు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని అయన ప్రశ్నించ్చారు.18 సంవంత్సరాల నుండి మహిళా సంఘాలకు వివో ఏ లు ఆర్థికంగా, సామజికంగా సేవలు అందిస్తుంటే వారికీ ప్రభుత్వం 3900/-రూపాయలు పారితోషికం ఇవ్వడం సిగ్గు చేటు అని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి వివో ఏ ల న్యాయబద్ధమైన సమస్యలను పరిష్కరించాలని, లేనిచో సమ్మెను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో సిపిఎం మండల కార్యదర్శి జి లక్ష్మణ్ తో పాటు వివోఎ ల మండల అధ్యక్షరాలు నాగలక్ష్మి, కార్యదర్శి సుధ, కోశాధికారి మల్లేష్, ఖాజాజి, నీలమ్మ, పరహాతు బేగం, గిరిజ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.