వంట వార్పు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి -జేఏసీ అఖిలపక్ష నాయకుల పిలుపు

వంట వార్పు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
-జేఏసీ అఖిలపక్ష నాయకుల పిలుపు

చేర్యాల,ఏప్రిల్ 19 అక్షిత ప్రతినిధి: చేర్యాల మున్సిపల్ పరిధిలోని పెంచిన ఇంటి పన్నులను తగ్గించాలని కోరుతూ,ఈనెల 21న పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద నిర్వహించే వంటావార్పు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ,జేఏసీ, అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో బుధవారం చేర్యాల పట్టణ శివారులోని రోళ్ళ బండ,బురాన్ మియా తోట, తదితర కాలనీలలో కరపత్రాలు పంపిణీ చేసి విస్తృతంగా ప్రచారాన్ని చేయడం జరిగింది.ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ పెంచిన ఇంటి పన్నులు తగ్గించాలని డిమాండ్ చేస్తూ అనేక ధర్నాలు, బంద్ లు నిర్వహించినప్పటికీ, మున్సిపాలిటీ అధికార యంత్రాంగానికి ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరమన్నారు.ఈ వంట వార్పుతోనైనా పాలకులు,అధికారులు స్పందించి పాత పద్ధతిలోనే పన్నుల విధానాన్ని కొనసాగించాలని కోరారు.జరుగే ఈ వంటా వార్పు కార్యక్రమాన్ని పట్టణ ప్రజలు,వ్యాపారస్తులు,కార్మికులు, హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈకార్యక్రమంలో కాంగ్రెస్,సిపియం, సిపిఐ, ఏఐఎఫ్ బీ,బీఎస్పీ,టీడీపీ,చాబర్ అఫ్ కామర్స్, ఎమ్మార్పీఎస్, మాల మహానాడు నాయకులతోపాటు, జేఏసీ చైర్మన్ డాక్టర్ రామగళ్ళ పరమేశ్వర్,ఇంటి పన్ను బాధితుల సంఘం నాయకులు జేఏసీ కో చైర్మన్ పూర్మ ఆగంరెడ్డి,మాజీ జడ్పీటీసీలు కొమ్ము నర్సింగరావు, దాసరి కళావతి,అవుషర్ల యాదయ్య,బుట్టి సత్యనారాయణ,పుట్ట రాజు మరియు రాములు,మహేష్, కనకయ్య,కనకవ్వ,రజిత తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking