అల్లాహ్ అందరిని చల్లగా చూడాలి -నిరుపేద ముస్లింలకు రంజాన్ కిట్స్ పంపిణీ చేసిన పులిపాటి ప్రసాద్

అల్లాహ్ అందరిని చల్లగా చూడాలి

-నిరుపేద ముస్లింలకు రంజాన్ కిట్స్ పంపిణీ చేసిన పులిపాటి ప్రసాద్

ఖమ్మం/ అక్షిత బ్యూరో :

డాక్టర్ పులిపాటి విద్యాసంస్థల అధినేత డాక్టర్ పులిపాటి ప్రసాద్ అధ్వర్యంలో పులిపాటి విద్యాసంస్థల అధినేత డాక్టర్ పులిపాటి ప్రసాద్ తండ్రి కీర్తిశేషులు పులిపాటి నరసింహారావు జ్ఞాపకార్ధంగా పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఐదునిరుపేద ముస్లిం కుటుంబాలకు పులిపాటి రంజాన్ తోఫా కిట్స్ ను బుధవారం ఖమ్మం నగరంలోని పులిపాటి నివాసంలో వారికి అందజేశారు.ఈ సందర్భంగా*
డాక్టర్ పులిపాటి ప్రసాద్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఉపవాస దీక్ష నిర్వహిస్తున్న నిరుపేద ముస్లిం సోదరీమణులకు మొత్తం ఐదు కుటుంబాలకు తన తండ్రి పేరుతో పులిపాటి రంజాన్ తోఫా ను అందించడం జరిగిందని ఈ తోఫాలో 25 కేజీల బియ్యం సేమియా నిత్యవసరాలతో కిట్స్ లో ఏర్పాటుచేసి వారికి అందించడం జరిగిందన్నారు. అంతేకాకుండా ఆర్ధిక స్తోమతలేని నిరుపేదముస్లిం మైనార్టీ మెరిట్ విద్యార్థులకు స్కాలర్షిప్ లను తాను అందించి వారి విద్యాభివృద్ధి కోసం పాటుపడతానని పేర్కొన్నారు.తన తండ్రి పేరుతో నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు భాగంగా 90% తన సామాజిక సేవలను ముమ్మరం చేయనున్నట్లు ఆయన వివరించారు.అనంతరం ఎంపిజే సంస్థ ఖమ్మం జిల్లా అధ్యక్షులు షేక్ ఖాసిం టియూడబ్యూజే (టిజేఎప్ )ఎలక్ట్రానిక్ మీడియా ఖమ్మం జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ కే జానీ పాషా మాట్లాడుతూ నిరుపేద ముస్లింలకు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా డాక్టర్ పులిపాటి ప్రసాద్ నిర్వహిస్తున్న సేవలు అభినందనీయమన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking