ఒకరోజు వర్క్ షాప్
సిద్దిపేట అక్షిత ప్రతినిధి :
సెక్యూరిటీ ప్లాన్ మరియు కమ్యూనికేషన్ వ్యవస్థ గురించి పోలీస్ అధికారులకు పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఒకరోజు వర్క్ షాప్ నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత పోలీస్ సిబ్బంది, బ్లూ కోల్డ్స్, పెట్రో కార్, నైట్ డ్యూటీ ఆఫీసర్స్, ఎస్ఐలు, సీఐలు, ఏసీపీలు, అడిషనల్ డీసీపీలు, ఏ ప్రదేశానికి ఎలా చేరుకోవాలో జిల్లా రూట్ మ్యాప్ ద్వారా కమ్యూనికేషన్ గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించడం జరిగింది.సిద్దిపేట పోలీస్ కంట్రోల్ రూమ్ కు డిజిపి ఆఫీసు నుండి కానీ, ప్రజల వద్ద నుండి కానీ పోలీస్ స్టేషన్ల నుండి కానీ, పోలీస్ అధికారుల నుండి కానీ,ఏదైనా సమాచారం వస్తే సమాచారం యొక్క ప్రాముఖ్యతను బట్టి పోలీస్ కమిషనర్ మేడమ్ గారికి ఎస్బి కంట్రోల్ కు సంబంధిత పోలీస్ అధికారులకు ఎలా తెలియపర చాలి అనే అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడు తూ ప్రకృతి వైపరీత్యాలు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ సెన్సిటివ్ ప్రాబ్లమ్స్ జరిగిన ప్పుడు పోలీస్ అధికారులు సంఘటనా స్థలానికి ఐదు నుండి పది నిమిషాల లోపు చేరుకోవాలి,సమాచారం విహెచ్ఎఫ్ సెట్ ద్వారా కానీ, ఫోన్ ద్వారా కానీ కంట్రోల్ రూమ్ నుండి వచ్చే సమాచా రాన్ని మరియు మెసేజ్ ని ప్రతి ఒక్కరూ షేర్ చేసుకోవాలి, సంఘటన స్థలానికి ఎలా చేరుకోవాలి రూట్ మ్యాప్ ద్వారా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారు లకు అవగాహన కల్పించడం జరిగింది. ఇతర జిల్లాల బార్డర్ పోలీస్ స్టేషన్ లో ఉన్న పోలీస్ అధికారులతో ఎప్పటికప్పుడు కమ్యూనికేషన్ పెంచుకోవాలి మరియు జిల్లాలలో రాష్ట్రంలో దేశంలో జరుగుతున్న ముఖ్య మైన సంఘటన గురించి ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి.

డివిజన్లో వారీగా సంబంధిత ఏసీబీ ఆఫీసులో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసుకోవా లని సూచించారు. జిల్లాలోని పోలీస్ స్టేషన్లో వారిగా ఎస్ఐలు వారి పరిధిలో ఉన్న గ్రామాల లోకి ఎలా వెళ్లాలో రూట్ మ్యాప్ తయారుచేసుకుని పోలీస్ స్టేషన్లో ఉన్న సిబ్బందికి అవగాహన కల్పించాలి సూచించారు. మరియు రూట్ మ్యాప్ గురించి ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి, సోషల్ మీడియాపై నిఘా ఉంచాలి
ముందస్తు సమాచారాన్ని సేకరించాలి, ఎవరినైనా అరెస్టు చేసే ముందు చట్ట ప్రకారం ఎస్ఓపి ప్రకారం నడుచుకొని అరెస్టు చేయాలి,జిల్లాలో ఏదైనా సంఘటన జరిగి నప్పుడు దానికి సంబంధించిన సమాచారం వచ్చే విధంగా ముందస్తు ఇన్ఫర్మేషన్ వ్యవస్థను పోలీస్ అధికారులు సిబ్బంది రూపొందించుకోవాలి
ప్రజల ద్వారా సమాచారం వచ్చే విధంగా ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండి గ్రామాలు పట్టణాలలో సంద ర్శించినప్పుడు సమాచారాన్ని సేకరించాలి,అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాలని సూచించారు,విధి నిర్వహణలో ఎలాంటి అలసత్వం వహించ కూడదని సూచించారు.
సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ లో 5s ఇంప్లిమెంటేషన్ పూర్తి చేయడం జరిగింది.ఈ సంద ర్భంగా పోలీస్ కమిషనర్ మేడం గారి ఆదేశానుసారం గజ్వేల్, సిద్దిపేట్, హుస్నాబాద్ డివిజన్ పోలీస్ అధికారులు రూరల్ పోలీస్ స్టేషన్కు వెళ్లి 5s ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా చేసారో ప్రతి అంశం గురించి అడిషనల్ డిసిపి అడ్మిన్ ఎస్, మహేందర్,స్వయంగా చూ పించి అవగాహన కల్పించారు.
ప్రతి పోలీస్ స్టేషన్లో, సర్కిల్ కార్యాలయాల్లో, ఏసిపి ఆఫీసులలో రూరల్ పోలీస్ స్టేషన్ మాదిరిగా 5s ఇంప్లి మెంటేషన్ పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ ఎస్. మహేందర్, ఏఆర్ అడిషనల్ డీసీపీలు రామ్ చందర్ రావు, సుభాష్ చంద్రబోస్, ఏసీపీలు రమేష్, సతీష్, ఫణిందర్, రవీందర్ రాజు, చంద్రశేఖర్, ఎస్పీ ఇన్స్పెక్టర్ రఘుపతి రెడ్డి, మరియు సిఐలు, ఎస్ఐలు, తదితరులు పాల్గొన్నారు.