ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి హాజరుకానున్న. ప్రభుత్వ విప్ రేగా
పినపాక అక్షిత ప్రతినిధి:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణం లోని 1వ వార్డు నుండి 10వ వార్డ్ వరకు విజయనగరం (తిర్లాపురం) సమ్మక్క సారక్క గుడి ప్రాంగణం నందు జిల్లా బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఆత్మీయ సమ్మేళ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని మనవి.