మంత్రి పువ్వాడ పుట్టినరోజు సందర్భంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
ఖమ్మం/ అక్షిత బ్యూరో :
రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా తలసేమియా బాధితులకు అండగా నిలిచేందుకు రక్తదాన శిబిరాన్ని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ డోలే లక్ష్మీ ప్రసన్న సాయికిరణ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని పార్టీ నగర అధ్యక్షులు పగడాల నాగరాజు మంత్రి పిఏ చిరుమామిళ్ల రవి కిరణ్ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ దాదే అమృత సతీష్ జిల్లా మైనార్టీ అధ్యక్షులు తాజుద్దీన్ నాయకులు ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు.