రైతులకు ఇబ్బందులు తలెతొద్దు
కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
నల్గొండ, అక్షిత ప్రతినిధి :
రైతులకు ఇబ్బంది లేకుండా
వడ్ల కొనుగోలుకు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణా రెడ్డి ఆదేశించారు.గురువారం జిల్లా కలెక్టర్ నల్గొండ మండలం కొత్త పల్లి,జి. చెన్నారం గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఐ.కె.పి.వడ్ల కొనుగోలు కేంద్రాలు కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి తనిఖీ చేశారు.కొనుగోలు కేంద్రాల్లో వేసవి దృష్ట్యా త్రాగు నీరు, ఓ.అర్.ఎస్ ప్యాకెట్ లు ,నీడ వసతి కల్పించాలని ఆదేశించారు.కొత్తపల్లి,జి. చెన్నారం ఐ.కె.పి.వడ్ల కొనుగోలు కేంద్రాల్లో ఎంత మంది రైతులు ఎంత పరిమాణం లో వడ్లు తీసుకు వచ్చారు.కొనుగోలు చేసిన వడ్ల పరిమాణం,మిల్లులకు తరలింపు తదితర విషయాలు కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

ధాన్యం తేమ శాతం, నాణ్యతా ప్రమాణాలు పరీక్షించి నిర్ణీత తేమ శాతం వచ్చిన ధాన్యం తూకం వేసి కొనుగోలు చేసిన వెంటనే మిల్లు కు తరలించాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యం తరలింపు కు లారీ లు పెంచాలని, జిల్లాలో ధాన్యం రవాణాకు నియమించిన లారీ కాంట్రాక్టర్ లు అవసరమైన లారీ లు కొనుగోలు కేంద్రాలలో ఏర్పాటు చేయాలని అన్నారు.ధాన్యం కొనుగోలు వివరాలు ఆన్లైన్ సాప్ట్ వేర్ ఓ.పి. ఎం.ఎస్.లో నమోదు చేయాలని సూచించారు.నల్గొండ మండలం కతాల్ గూడ లోని బాలాజీ రైస్ మిల్లు ను కలెక్టర్ తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రాల నుండి వచ్చిన లారీల నుండి ధాన్యంను మిల్లర్ లు జాప్యం లేకుండా దిగుమతి చేసుకోవాలని ఆదేశించారు.ప్రతి మిల్లు పాయింట్ వద్ద ధాన్యం అన్ లోడింగ్ పరిశీలన కు సిబ్బంది ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
జిల్లాలో ఐ.కె.పి.121 కేంద్రాలు,పి. ఏ. సి.ఎస్.114 కేంద్రాలు మొత్తం 235 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 45,068 మెట్రిక్ టన్నుల ధాన్యం 5248 మంది రైతుల నుండి కొనుగోలు చేసినట్లు, 41677 మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లులకు రవాణా చేయడం జరిగిందని తెలిపారు.
జిల్లా కలెక్టర్ వెంట జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా పౌర సరఫరాల డి.యం.నాగేశ్వర్ రావు, డి.అర్.డి.ఓ కాళిందిని ,నల్గొండ ఎం.పి.డి. ఓ శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు.