బల్దియా లో ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాలకు దరఖాస్తుల ఆహ్వానం : ఇంచార్జ్ కమిషనర్ ప్రావీణ్య
వరంగల్ ,అక్షిత బ్యూరో : వేసవి క్రీడా శిక్షణ శిబిరాలలో పాల్గొనుటకు బల్దియా పరిధిలోని బాల బాలికల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వరంగల్ కలెక్టర్, ఇంచార్జ్ కమిషనర్ ప్రావీణ్య నేడోక ప్రకటనలో పేర్కొన్నారు. మే ఒకటి నుంచి 31వరకు బల్దియా లోని ఇండోర్ స్టేడియం లో జూడో, బ్యామేంటిన్, టేబుల్ టెన్నిస్, చెస్, యోగా, క్యారం లలో ఉచితంగా నిర్వహించే క్రీడాంశాలకు గాను ఆసక్తి గల 14 సంవత్సరాల లోపు గల బాల బాలికలు ఈ నెల 30లోగా జిడబ్ల్యూ ఎంసీ ఆవరణలోని ఇండోర్ స్టేడియం లో దరకాస్తూ చేసుకోవాలని అన్నారు. మరిన్ని వివరాలకు డి ఎఫ్ ఓ , స్పోర్ట్స్ డైరెక్టర్ 970 199668 నంబరులో సంప్రదించాలని కోరారు.చంద్ర, శ్రీనివాసరావు, ఈఈ లు శ్రీనివాసరావు, రాజయ్య, రాజ్ కుమార్, డీఈ లు రవి కుమార్, నరేందర్, సంతోష్ బాబు, రవి కిరణ్, తదితరులు పాల్గొన్నారు