కంటివెలుగు’ను సద్వినియోగం చేసుకోవాలి

కంటివెలుగు’ను సద్వినియోగం చేసుకోవాలి
మరిపెడ అక్షిత ప్రతినిధి:-
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతీ ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి నూకల నరేష్ రెడ్డి అన్నారు.గురువారము మరిపెడ మండల పరిధిలోని పురషోత్తమయ గూడెం గ్రామములో ఆయన కంటి వెలుగు శిబిరంను ఆయన ప్రారంభించాడు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలు కంటి పరీక్షలు చేయించుకొని, ఉచితంగా మందులు పొందాలని సూచించారు. కంటి సమస్యలు ఉన్నవారు తప్పని సరిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమములో డాక్టర్ సతీష్, అఖిల,మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking