ఇఫ్తార్ విందులో పాల్గొన్న బాలింగ్ గౌతమ్ గౌడ్.
శేరిలింగంపల్లి అక్షిత ప్రతినిధి: శేరిలింగంపల్లి నియోజక వర్గపరిధిలో ని హాఫిజ్ పెట్ లో ఉన్న జామియా మసీదు లో గురువారము సాయంత్రం రోజ లో ఉన్న ముస్లిం సోదరుల ఇఫ్తార్ విందులో ముఖ్య అతిథిగా హాజరైన బీ అర్ స్ హాఫిజ్ పెట్ 109 డివిజన్ అధ్యక్షులు బాలింగ్ గౌతమ్ గౌడ్ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిమ్ సోదరుల తో ఇఫ్తార్ విందులో పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు. అల్లా దయా అందరిపై ఉండి ప్రజలంతా సుఖా శాంతులతో సోదర భావం తో కలసి మెలసి జీవించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మొహమ్మద్ గ్హౌస్, సైయద్ సదిక్, రామకృష్ణ గౌడ్,జమిర్ లింరా, ఫిరోజ్,నజీర్,షేక్ సాబేర్, చంద్ పాష, యూనుస్, శ్రీనివాస్ గౌడ్, మల్లేష్ గౌడ్ పాల్గొన్నారు