వివో ఎ ల సమ్మెకు బి ఎస్ పి మద్దతు

వివో ఎ ల సమ్మెకు బి ఎస్ పి మద్దతు

నాంపల్లి, అక్షిత న్యూస్:

మండలంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిర్వహించిన వివోఏ ల సమ్మెలో పాల్గొన్న బహుజన్ సమాజ్ పార్టీ నాంపల్లి మండల కమిటీ ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాంపల్లి మండల అద్యక్షులు పల్లేటి వినోద్ కుమార్ మాట్లాడుతూ, వివో ఏ లను కరోనా సమయంలో ఎన్నికల సమయంలో తమ స్వార్థం కొరకు వాడుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. మహిళా సంఘాల రుణాలను విదిగా చెల్లించడంలో కీలక పాత్ర పోషించిన వివో ఏ లేనని అన్నారు…ఎంతో కష్టపడ్డ వివో ఏ లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని…వివో ఏ లకి 26000 కనీస వేతనం చెల్లించాలని ప్రమాద బీమా 10 లక్షలు ఇవ్వాలిని వివో ఏ లను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలని అర్హులైన వివో ఏ లను సీసీ లుగా ప్రమోట్ చేయాలని వీవోఏ లతో ఆన్లైన్ పనులు చేయించకూడదుని ఉద్యోగ భద్రత కల్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు….
వివో ఏ ల సమస్యలు త్వరగా పరిష్కరించకపోతే రాష్ట్ర ప్రభుత్వమే సమాధానం చెప్పాల్సి ఉంటుందని అన్నారు…. ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ నాంపల్లి మండల ఉపాధ్యక్షుడు జిల్లా గోని మహేష్ ,ప్రదాన కార్యదర్శి నాంపల్లి సైదులు,పసునూరు గ్రామ అధ్యక్షుడు వంశీ ,బీఎస్పీ నాయకులు ప్రవీణ్ యాదవ్,రమేశ్ , సాయి, ఆనంద్, సైదా బేగం వివిధ గ్రామాల వీఓఏ లు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking