చలివేంద్రం ఏర్పాటుకు అనుమతించండి

చలివేంద్రం ఏర్పాటుకు అనుమతించండి

జవహర్ నగర్ అక్షిత ప్రతినిధి:

జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కెసిఆర్ కూరగాయల మార్కెట్ వద్ద ఉన్న శ్రీ సాయి ఆటో ట్రాలీ గూడ్స్ అసోసియేషన్ సభ్యులు ప్రజల దాహాన్ని తీర్చేందుకు ఆటో స్టాండ్ వద్ద చలివేంద్రం ఏర్పాటుకై జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అనుమతి కోసం ఆటో కార్మిక సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆటో యూనియన్ అధ్యక్షులు మంగళంపల్లి తిరుపతి మాట్లాడుతూ వేసవిలో రోజురోజుకు ఎండలు తీవ్రమవుతున్న తరుణంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రంను ప్రారంభిస్తున్నమని,ప్రజలు ఈ చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వేసవికాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు పలుచోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేసేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలన్నారు. ఎండాకాలంలో వడదెబ్బ తగలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి గడియాముల అంకబాబు మరియు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking