తాగునీటి ఇబ్బందులు
రాకుండా చర్యలు తీసుకోవాలి
*ఎంపిడిఓ జ్యోతిలక్ష్మి
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
వేసవిలో అన్ని గ్రామాల్లో నీటిఎద్దడి నివారణకు, ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని మిర్యాలగూడ ఎంపిడిఓ గార్లపాటి జ్యోతిలక్ష్మి కోరారు. గురువారం మండలం పరిషత్ హాలులో పంచాయతీ కార్యదర్శులు, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై
జరిగిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ
ప్రతి గ్రామపంచాయతిలో కొత్త పనులు గుర్తించి, అంచనాలు తయారు చేసుకోవాలన్నారు.

ప్రతి గ్రామపంచాయతిలో చేసి పనులను త్వరగా పూర్తి త్వరగా పూర్తి చేయాలన్నారు.
గ్రామ పంచాయతిలో పంచాయతీ కార్యదర్శులందరు డిఎస్‌ఆర్ అటెండన్స్ 9 గంటల లోపు చేయాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు ఇంటి పన్నులు రిజిష్టర్ ఏప్రిల్ 30 లోపు తయారు చేసుకోవాలన్నారు.
కార్యక్రమంలో యంపిఓ టి.వీరారెడ్డి ఇంచార్జ్ ఏపిఓ కళావతి టిఏ లు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.