ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి *మాజీ ఎమ్మెల్యే రేపాల

ధాన్యం కొనుగోళ్లు
వేగవంతం చేయాలి
*మాజీ ఎమ్మెల్యే రేపాల
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
మిర్యాలగూడ మార్కెట్ యార్డును గురువారం మాజీ ఎమ్మెల్యే రేపాల శ్రీనివాస్ సందర్శించి ధాన్యం కొనుగోళ్లు జరగక ఇబ్బంది పడుతున్న రైతుల వద్దకు వెళ్లి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. మండుటెండలో ఇబ్బంది పడుతున్న రైతులకు పుచ్చ పండ్లను పంచిపెట్టారు. రైతు ప్రభుత్వమని చెప్పే ప్రభుత్వాలు రైతుల గోసను పట్టించుకోవాలని ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేసి కాంటాలను పెంచి రైతుల సమస్యలు సత్వరమే పరిష్కరించాలని రైతుల సమస్యల పరిష్కారం కొరకే తాను చొక్కా విప్పి నిరసన వ్యక్తం చేయడం జరిగిందన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం విక్రయించుకోవడానికి నానా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. యాసంగి వరి ధాన్యం కోతలు ప్రారంభమై 20 రోజులు గడుస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఐకెపి కేంద్రాలను ఇటీవలనే ప్రారంభించింది. ఐకెపి కేంద్రాలకు పది రోజులకు పైగా ధాన్యం తీసుకొచ్చిన రైతులు రాశులు కుప్పలుగా పోసుకున్నారు. వేసవికాలం కావడం వల్ల రైతులు రాశుల వద్ద కావలి ఉండే పరిస్థితులు లేకుండా పోయాయన్నారు. దీంతో ఇదే అదనుగా భావిస్తున్న అక్కడి సిబ్బందికి లంచం ఇస్తేనే ముందు కాంటాలు వేసే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking