గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను కలిసిన జిల్లా నాయకులు
మంచిర్యాల, అక్షిత బ్యూరో:
ఇటీవల రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ గా నియమితులైన తెలంగాణ ఉద్యమకారుడు, బీసీ యువ నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను హైదరాబాదులో జిల్లాకు చెందిన స్థానిక నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి, శాలువాతో ఘనంగా సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. శ్రీనివాస్ యాదవ్ ను కలిసిన వారిలో జిల్లాకు చెందిన సింగరేణి మైనింగ్ స్టాప్ సెంట్రల్ ఆర్గనైజింగ్ కార్యదర్శి కారుకూరి లక్ష్మణ్, మందమర్రి బిఆర్ఎస్ నాయకుడు సింగరేణి శ్రీనివాస్, హైదరాబాద్ ఆటో అసోసియేషన్ అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి తదితరులు కలరు.