సామాజిక సేవా తరంగం ‘సిద్దార్ధ’ * ఎన్బీఆర్ ఫౌండేషన్ ద్వారా విస్తృత సేవలు * మిర్యాలగూడ నియోజకవర్గం వ్యాప్తంగా 7,500 ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫాలు పంపిణీ

సామాజిక సేవా తరంగం ‘సిద్దార్ధ’

* ఎన్బీఆర్ ఫౌండేషన్ ద్వారా విస్తృత సేవలు

* మిర్యాలగూడ నియోజకవర్గం వ్యాప్తంగా 7,500 ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫాలు పంపిణీ

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

#మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు తనయుడు, యువనేత, ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్ధ సామాజిక సేవా తరంగం లాంటివారని నియోజకవర్గ ప్రజాప్రతినిధులు అభివర్ణించారు. కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో వేలాది మందికి యువనేత ఆసరా కల్పించారు. అన్నార్తులకు బియ్యం, నిత్యవసరాలను పంపిణీ చేసి ఆదుకున్నారు.

కరోనా బారినపడిన జర్నలిస్టులకు క్లిష్ట సమయాల్లో ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున మొత్తం 38 మందికి రూ.3,45,000 ఆర్ధిక సాయం అందించారు. ఎన్బీఆర్ ఫౌండేషన్ ద్వారా వేలాది మంది నిరుద్యోగులకు స్టడీ మెటీరియల్ అందజేయడంతో పాటు ఉచిత శిక్షణ ఇప్పించి వారి కుటుంబాల్లో వెలుగులు నింపారు. అయ్యప్ప స్వామి మాలదారులకు రెండు నెలలకు పైగా అల్పాహారం వితరణ చేపట్టారు. యువతలో శారీరక, మానసిక వికాసాన్ని పెంపొందించడంతో పాటుగా వారిని క్రీడల్లో ప్రోత్సహించేందుకు టోర్నమెంట్స్ నిర్వహించారు.

తాజాగా,మిర్యాలగూడ నియోజకవర్గం వ్యాప్తంగా 7,500 ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫాలను పంపిణీ చేసి సర్వమత సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలిచాడు. ఆయన నిర్వర్తిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు యువతకు స్ఫూర్తిదాయకంగా మారాయి. గత మూడు రోజుల నుంచి మిర్యాలగూడ నియోజకవర్గం వ్యాప్తంగా అన్ని మండలాల్లో, మిర్యాలగూడ పట్టణంలో స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి యువనేత, ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్ధ రంజాన్ తోఫాలను పంపిణీ చేశారు. ముస్లిం సోదరసోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం సోదరసోదరీమణులంతా పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలను భక్తి శ్రద్ధలతో చేపట్టాలని యువనేత నల్లమోతు సిద్దార్ధ ఆకాంక్షించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking