విజిలెన్స్ తనిఖీలు
*రేషన్ డీలర్ పై 6ఏ కేసు నమోదు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
మండలంలోని యాదగిరి పల్లి గ్రామానికి చెందిన రేషన్ డీలర్ పై 6 ఏ కేసు నమోదు చేశారు. రేషన్ డీలర్ బడుగుల లింగయ్య షాప్ నెంబర్ 13 ను విజిలెన్స్, సివిల్ సప్లై అధికారులు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు బియ్యం నిల్వలను పరిశీలించారు. 10.74 క్వింటాళ్ల బియ్యం అధికంగా ఉన్నట్లు గుర్తించారు. డీలర్ బడుగుల లింగయ్య పై 6 ఏ కేసు నమోదు చేసి, స్టాక్ ను పక్కనే ఉన్న షాప్ నెంబర్ 14 బంటు లక్ష్మయ్యకు అప్పగించారు. ఈ సందర్భంగా సివిల్ సప్లై డిప్యూటీ తాసిల్దార్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రజా పంపిణీ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో విజిలెన్స్ సిఐ మహేష్, ఎస్ఐ గౌస్, వెంకట్ రెడ్డి తదితరులు ఉన్నారు.