మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలకు
రంజాన్ శుభాకాంక్షలు
యువనేత నల్లమోతు సిద్దార్ధ
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
రంజాన్ పండుగ సందర్భంగా మిర్యాలగూడ నియోజకవర్గంలోని ముస్లిం సోదరసోదరీమణులకు బీఆర్ఎస్ యువనేత, ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్, యువనేత నల్లమోతు సిద్దార్ధ శుభాకాంక్షలు తెలిపారు. నెలరోజుల పాటు ఉపవాస దీక్షలతో రంజాన్ మాసం శాంతి,ప్రేమ,దయ , సౌభ్రాతృత్వ గుణాలను పంచుతుందని,తెలంగాణలో గంగా జమునా తహజీబ్ కు రంజాన్ పండుగ ప్రతీక అని సిద్దార్ధ తెలిపారు. మైనారిటీల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలు ముస్లింల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని, గుణాత్మక ఫలితాలనిస్తున్నాయని అన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలంతా భక్తి, శ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో ఇంటిల్లిపాది రంజాన్ పండుగను జరుపుకోవాలని నల్లమోతు సిద్దార్ధ ఆకాంక్షించారు.