మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు
ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
రంజాన్ పండుగ సందర్భంగా మిర్యాలగూడ నియోజకవర్గంలోని ముస్లిం సోదరసోదరీమణులకు శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. నెలరోజుల పాటు ఉపవాస దీక్షలతో రంజాన్ మాసం శాంతి,ప్రేమ,దయ , సౌభ్రాతృత్వ గుణాలను పంచుతుందని, తెలంగాణలో గంగా జమునా తహజీబ్ కు రంజాన్ పండుగ ప్రతీక అని భాస్కర్ రావు తెలిపారు. మైనారిటీల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలు ముస్లింల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని,గుణాత్మక ఫలితాలనిస్తున్నాయని అన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలంతా భక్తి, శ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో ఇంటిల్లిపాది రంజాన్ పండుగను జరుపుకోవాలని నల్లమోతు భాస్కర్ రావు ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ సర్కార్ మైనారిటీల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న ప్రజా సంక్షేమ పథకాలు యావత్ దేశానికే దిక్సూచిగా మారాయని భాస్కర్ రావు తెలిపారు.