అల్లా దయవల్ల ప్రజలందరూ చల్లగా ఉండాలి: ఎమ్మెల్యే వనమా * రంజాన్ పండుగ ముస్లింలకు ఎంతో ప్రియమైన పండుగ * ముఖ్యమంత్రి కెసిఆర్, కేటీఆర్ ముస్లింల అభివృద్ధి కోసం ఎంతగానో కృషి
అల్లా దయవల్ల ప్రజలందరూ చల్లగా ఉండాలి: ఎమ్మెల్యే వనమా
* రంజాన్ పండుగ ముస్లింలకు ఎంతో ప్రియమైన పండుగ
* ముఖ్యమంత్రి కెసిఆర్, కేటీఆర్ ముస్లింల అభివృద్ధి కోసం ఎంతగానో కృషి
భద్రాద్రి కొత్తగూడెం అక్షిత ప్రతినిధి:
అల్లా దయవల్ల ప్రజలందరూ చల్లగా ఉండాలని రంజాన్ పండుగ ముస్లింలకు ఎంతో ప్రియమైన పండుగని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్, కేటీఆర్ ముస్లింల అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేయడం జరుగుతుందన్నారు.

శనివారం రంజాన్ పండుగ సందర్భంగా కొత్తగూడెం బోడగుట్ట ఈద్గా ప్రార్థనలో ఎమ్మెల్యే పాల్గొని ప్రార్థనలు చేసి ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వనమా వెంట వనమా రాఘవేందర్ జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావు మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి నాయకులు కాసుల వెంకట్ రజాక్ కమిటీ సభ్యులు మసూద్ యూసుఫ్ చైర్మన్ అన్వర్ పాషా కో ఆప్షన్ సభ్యులు యాకూబ్ 22వ వార్డు యాకూబ్ సాదిక్ పాషా మార్కెట్ కమిటీ చైర్మన్ భుక్యా రాంబాబు సొసైటీ చైర్మన్ మండే హనుమంతరావు బిఆర్ఎస్ నాయకులు టీబీజీకేస్ నాయకులు కార్యకర్తలు ముస్లిం మత పెద్దలు ముస్లిం సోదరులు ఉన్నారు.