బందో బస్తు ను పర్యవేక్షణ చేసి న అడిషనల్ డీసీపీ అడ్మిన్ ఎస్ మహేందర్
సిద్దిపేట అక్షిత ప్రతినిధి :
రంజాన్ పర్వదిన పండుగ సందర్భంగా సిద్దిపేట పట్టణం ఎగ్బాల్ మీనార్ వద్ద బందో బస్తు ను అడిషనల్ డీసీపీ అడ్మిన్ ఎస్ మహేందర్ పర్యవేక్షణ చేశారు.ఈ సంద ర్భంగా అడిషనల్ డీసీపీ అడ్మిన్ మాట్లాడుతూ పవిత్ర మైన రంజాన్ పండుగ సంద ర్భంగా సిద్దిపేట పట్టణం ఎగ్బాల్ మీనార్ వద్ద సిద్దిపేట పట్టణం ఇతర మసీదుల మరి యు గజ్వేల్,హుస్నాబాద్, దుబ్బాక, చేర్యాల పట్టణాలలో కూడా పోలీస్ కమిషనర్ ఆదే శానుసారం పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.ఇక్బాల్ మీనార్ వద్ద స్వయంగా బందోబస్తు పర్యవేక్షణ చేసి ప్రార్థనలు అ యిపోయిన తర్వాత ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.జిల్లా లో ప్రశాంతమైన వాతావరణం లో ఆనందోత్సవాల మధ్య ముస్లిం సోదరులు నమాజ్ ప్రార్ధనలు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సిద్దిపేట ఏసీపి దేవారెడ్డి, ట్రాఫిక్ ఏసిపి ఫణిందర్, ఇన్స్పెక్టర్లు బిక్షపతి, రవికుమార్, భాను ప్రకాష్, సిద్దిపేట రూరల్ సీఐ జానకిరా మ్ రెడ్డి,ట్రాఫిక్ సిఐ రామకృష్ణ, మరియు ఎస్ఐలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.