వివోఎ ల సమస్యలను పరిష్కరించాలి బిఎస్పి నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి

వివోఎ ల సమస్యలను పరిష్కరించాలి

బిఎస్పి నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి

నకిరేకల్ అక్షిత ప్రతినిధి:

తెలంగాణ ఐకేపి విఓఏ ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని బిఎస్పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి డిమాండ్ చేసారు.శనివారం కట్టంగూర్ మండల విఓఏ ల నిరసన కార్యక్రమంలో పాల్గొని వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం విఓఏ లను, సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని కనీస వేతనం రూ. 26 వేలు అందించాలని అన్నారు. అంతే కాకుండ వారికీ గుర్తింపు కార్డులు ఇచ్చి పది లక్షల సాధారణ ఆరోగ్య బీమా అందజేసి వారికీ అండగా నిలబడాల్సిన అవసరం నేటి తెలంగాణ ప్రభుత్వానికి ఉందని తెలియజేసారు. అర్హులైన విఓఏ లను సీసీ లుగా పదవి ఉన్నత కల్పించి వారికీ న్యాయం చేయాలనీ అలాగే పెండింగ్ వేతనాలు చెల్లించడం లో సైతం ప్రభుత్వం వారిపై చిన్న చూపు చూడడం సరికాదని ఆమె డిమాండ్ చేశారు. వారికీ న్యాయం జరగని పక్షంలో వారి తరుపున పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని ఆమె అన్నారు. ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు మేడి శ్రీనివాస్, చిట్యాల మండల ఉపాధక్షులు గ్యార శేఖర్, కోశాధికారి మునుగోటి సత్తయ్య, విఓఏ లు కంచర్ల సుజాత, బండారి శైలజ, ఉట్కూరి రేణుక, గద్దపాటి నగేష్, ఇంద్రకాంటి సాయి, పులి పద్మ, జ్యోతి, అనిత బి ఎస్ పి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking