కోదాడ పట్టణ ప్రజలపై అల్లా కరుణ చూపాలి ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు మాజీ ఎమ్మెల్యే ఉత్తం పద్మావతి రెడ్డి

కోదాడ పట్టణ ప్రజలపై అల్లా కరుణ చూపాలి

ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు

మాజీ ఎమ్మెల్యే ఉత్తం పద్మావతి రెడ్డి

కోదాడ టౌన్ ,అక్షిత న్యూస్:

ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ పండుగను భక్తిశ్రద్ధలతో ప్రజలు జరుపుకొని సుఖ సంతోషాలతో ఉండాలని మాజీ ఎమ్మెల్యే ఉత్తం పద్మావతి రెడ్డి అన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నెల రోజులుగా సాగుతున్న ముస్లిం ఉపవాస దీక్షలు ఫలించి ముస్లిం సోదరులు కోరుకున్న కోరికలు తప్పకుండా అల్లా నెరవేర్చాలని వారు తెలిపారు.

ఈరోజు మహబూబ్ జానీ నివాసంలో పలువురు నాయకులు వెళ్లి జానీ బాయ్ కి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు ముస్లింలు ఎంతో ఇష్టంగా తయారు చేసే సేమియా పాయసం డ్రై ఫ్రూట్స్ అందరికీ ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మాజీ ఇంచార్జ్ కన్మంత రెడ్డి శశిధర్ రెడ్డి మాజీ సర్పంచ్ ఎర్నేని వెంకటరత్నం బాబు, మాజీ డిసిసిబి చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు, వంగవీటి రామారావు ,కందుల కోటేశ్వరరావు ,,వనపర్తి లక్ష్మీనారాయణ , తిప్పిరి శెట్టి రాజు, పెండెం వెంకటేశ్వర్లు, బాగ్దాద్, భాయిజాన్ ,బండారు శ్రీనివాస్, దొంగరి శ్రీనివాస్ ,ఖందరబోయిన వేలాద్రి, తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking