పీవీకే 5మైన్ ను సందర్శించిన సింగరేణి మెయిన్ హాస్పిటల్ మహిళా డాక్టర్స్

పీవీకే 5మైన్ ను సందర్శించిన సింగరేణి మెయిన్ హాస్పిటల్ మహిళా డాక్టర్స్

భద్రాద్రి కొత్తగూడెం అక్షిత ప్రతినిధి:

పీవీకే 5మైన్ ను శనివారం మెయిన్ హాస్పిటల్ డాక్టర్స్ బృందం సందర్శించడం జరిగింది.
గని మేనేజర్ పాలడుగు శ్రీనివాస్ రీజినల్ సెక్రటరీ కూసన సూచనతో వైద్యులు గనిలోనికి దిగి కార్మికులు పనిచేసే పనిప్రదేశాలను పరిశీలించారు. డాక్టర్ల బృందం పీవీకే 5మైన్ నందు ప్రొడక్షన్ తీసే కంటిన్యూస్ మైనర్ మెషిన్ వద్దకు వెళ్లి కార్మికులతో మాట్లాడారు చెమటోడ్చి కష్టించి పనిచేసే కార్మికులకు వేసవిలో తీసుకోవలసిన జాగ్రత్తలు అండర్ గ్రౌండ్ లో పనిప్రదేశంలో తీసుకోవలసిన ఆరోగ్య సూత్రాలను కార్మికులకు వైద్యులు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గని మేనేజర్ పాలడుగు శ్రీనివాస్, రీజినల్ సెక్రటరీ కూసన వీరభద్రం, డాక్టర్స్ బృందం సభ్యులు రేస్మా, దివ్యశ్రీ, వినూత్న, సువర్ణరేఖ, మెయిన్ హాస్పిటల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎం.శ్రీనివాస్, పీవీకే వెల్ఫేర్ ఆఫీసర్ అజయ్, అసిస్టెంట్ మేనేజర్ అనిల్ సాగర్, పిట్ సెక్రటరీ చిలక రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking