మజీద్ కమిటీ అధ్యక్షుడుగా ఎండి ముజీబ్

మజీద్ కమిటీ అధ్యక్షుడుగా ఎండి ముజీబ్

చేర్యాల,ఏప్రిల్ 22 అక్షిత ప్రతినిధి: రంజాన్ వేడుకల సందర్భంగా చేర్యాల మండలం ఆకునూరు గ్రామంలోని మజీద్ లో ముస్లిం సోదరులు ఘనంగా ప్రార్థనలు నిర్వహించిన అనంతరం చిన్న పెద్ద తేడా లేకుండా ఒకరినొకరు ఆ లింగణం చేసుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం ముస్లిం సోదరులందరూ మజీద్ నూతన కమిటీ అధ్యక్షుడిగా మహమ్మద్ ముజీబ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు ముజీబ్ మాట్లాడుతూ మజీద్ డెవలప్ కోసం కృషి చేస్తానని తెలుపుతూ,ముస్లిం సోదరులకు మరియు గ్రామ ప్రజలందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మౌలానా,గోరేమియా,హమ్మద్, ఎండి హబీబ్,హైమత్,అక్బర్, సద్దాం హుస్సేన్,మరియు అన్వర్, అస్గర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking