రాచకొండ గిరిజనులకు పోడు పట్టాలు ఇవ్వాలి – సిపిఐ నల్గొండ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం

రాచకొండ గిరిజనులకు పోడు పట్టాలు ఇవ్వాలి
– సిపిఐ నల్గొండ జిల్లా కార్యదర్శి
నెల్లికంటి సత్యం
అక్షిత: సంస్థాన్ నారాయణపురం
తరతరాలుగా రాచకొండ ప్రాంతంలో పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనులకు వెంటనే పట్టాలు ఇవ్వాలని సిపిఐ నల్గొండ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మునుగోడు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికై సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాదయాత్ర మూడవరోజు సంస్థాన్ నారాయణపురం మండలం లోని గంగ మూల తండా, జనగాం, వావిల్లపల్లి,చిల్లాపురం, లచ్చమ్మ గూడెం వరకు కొనసాగుతుంది ఈ సందర్భంగా గిరిజనులు వివిధ గ్రామాల ప్రజలు పాదయాత్రకు ఘన స్వాగతం పలికారు. జనగామ గ్రామంలో మహిళలు బతుకమ్మతో ఘన స్వాగతం పలికారు అనేక సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న గిరిజనులను ఫారెస్ట్ అధికారులు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని వెంటనే ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించాలని, ఆయా గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని పరిశీలించి రైతులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు

రైతు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. క్వింటాల్కు 2500 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ పాదయాత్ర బృందంలో పాల్గొన్నవారు ఆర్ అంజాచారి, బచ్చనగోని గాలయ్య, కే శ్రీనివాస్, గురుజ రామచంద్రం బొలుగురి నరసింహ టి వెంకటేశ్వర్లు, సిపిఐ మండల కార్యదర్శి దుబ్బాక భాస్కర్,పల్లె శేఖర్ రెడ్డి, సిపిఐ పార్టీ జిల్లా సమితి సభ్యులు చిలువేరు అంజయ్య,కలకొండ సంజీవ, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు బి జగన్, ఏ ఐ యస్ యఫ్ అధ్యక్ష కార్యదర్శులు బి వెంకటేష్, ఎం మురళీకృష్ణ, కందుల లింగమ్మ, సర్పంచ్ కళమ్మ నాగరాజు, కొప్పు సుధాకర్, దుబ్బాక కిషన్,ముత్యాల అంజయ్య, మారాగోని నాగరాజు, శనిగల నరేష్, ప్రజానాట్యమండలి కళాకారులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking