అన్నింటి లో సిద్దిపేట నెంబర్ వన్ ఉండాలన్నదే నా తపన..
◆ సిద్దిపేట నలుదిశలా అభి వృద్ధి…
◆ అభివృద్ధి అయిందని అనే వారు ఉన్నారు.. కాలేదనే వారు లేరు..
◆మండుటెండల్లో మత్తళ్లు దుంకుతాయని ఊహించా మ.. !!
◆ మంత్రి హరీష్ రావు సమక్షం లో బిజెపి నుండి బి ఆర్ ఎస్ లో చేరిన గోనెపల్లి యువకు లు..
సిద్దిపేట అక్షిత ప్రతినిధి :
సిద్దిపేట నలుదిశలా అభివృద్ధి లో ఆదర్శంగా నిలుస్తున్నది అని మంత్రి హరీష్ రావు అ న్నారు.చిన్న కోడూరు మండ లం గోనెపల్లి గ్రామం నుండి 20 మంది యువకులు బీజేపీకి నుండి బి ఆర్ ఎస్ పార్టీ లో చేరారు.ఈ సందర్భంగా మాట్లా డుతూ సిద్దిపేట అభివృద్ధి లో రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచిం దని ,సాగు త్రాగు నీటి గోస తీర్చిన గొప్ప కార్యం చేసుకు న్నామన్నారు.రంగనాయక సాగర్ తో సిద్దిపేట ను మరో కోనసీమ గా మార్చుకున్నాము మండే ఎండల్లో నిండు కుండ ల్లా చెరువులు,మండుటెండల్లో చెక్ డ్యామ్ లు మత్తళ్ళు దుం కుతున్నాయి అనేది ఉహించు కున్నామ కలలో అయినా కల గన్నామ ఇది సాధ్యం అయ్యే పనా కానీ మన కళ్ళముందు చూస్తున్నాము కాలం కానీ కాకా ఫోని కాళేశ్వరం జలాలతో నిం డు కుండల మన రంగనాయక సాగర్ లో గోదావరి జలాలు ఉంటాయ్ సిద్దిపేట అభివృద్ధి కాలేదు అని అనడం లేదు.

అభివృద్ధి చూసి ఓర్వ లేని వారు ఉన్నారు.అభివృద్ధి ని చూసి ఎలెత్తి చూపే వారు లేరన్నారు.అభివృద్ధి లో నంబర్ వన్ ఉండాలన్నదే నా తపన అని అన్నారు. అభివృద్ధి లో,అవార్డు ల్లో సిద్దిపేట రా ష్ట్రంలో నే ఆదర్శంగా నిలిచా మని మరింత ఐక్యత తో ముందుకుపోదామన్నారు. కార్యాకర్తలు కాపాడుకుంటా అందరికి కుడి ఎడమ గా గుర్తింపు ఉంటుందని ప్రతి కార్యకర్త కు సముచిత స్థానం ఉంటుందన్నారు.ఈ కార్యక్ర మంలో రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ,ఎంపీపీ మణిక్య రెడ్డి, పార్టీ అధ్యక్షుడు కాముని శ్రీను, పాపయ్య, రవీందర్ రెడ్డి , సర్పంచ్ స్వరూప ఎల్లా గౌడ్, ఎంపీటీసీ పద్మ మలేశం, గ్రామ పార్టీ అధ్యక్షుడు అమర్ పాల్గొన్నారు.చేరిన వారు శ్రీకాంత్,మహేష్,రవి, కుమా ర్,మున్నీ ,అశోక్,అంజిరెడ్డి, అజయ్ తదితరులు పాల్గొ న్నారు.