నిరుద్యోగుల ఆత్మగౌరవ పోరాటానికై ఛలో ఖమ్మం. 24 న ఖమ్మంలో కదంతొక్కనున్న నిరుద్యోగ గళం.

నిరుద్యోగుల ఆత్మగౌరవ పోరాటానికై ఛలో ఖమ్మం.

24 న ఖమ్మంలో కదంతొక్కనున్న నిరుద్యోగ గళం.

విద్యార్థులు, నిరుద్యోగులు, అనుభంధసంఘాల సమన్వయంతో భారీర్యాలీ చేపట్టనున్న కాంగ్రెస్. హాజరుకానున్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.

నిరుద్యోగ నిరసన ర్యాలీని విజయవంతం చేయండి:కాంగ్రెస్ యంత్రాంగం

పినపాక అక్షిత ప్రతినిధి:

ఓ పక్క ఇంటికో ఉద్యోగమిస్తామని చెపుతూ కాలం వెళ్లబుచ్చుతున్న కేసీఆర్ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా
మరోపక్క
ఏడాదికి రెండుకోట్ల ఉద్యోగాలిస్తానని మోసంచేసిన మోదీ నియంతపాలనలకు చమరగీతంగా
యువతను చైతన్యపరిచి, యువత బంగారు భవిష్యత్తుకోసం బాటలువేసుకునేలా, ఉద్యోగ కల్పనాయుద్ధానికి సిద్ధంచేసేందుకు ఈనెల 24 న ఖమ్మం పట్టణంలో కాంగ్రెస్ నేతృత్వంలో, రేవంత్ రెడ్డి సారధ్యంలో జరగబోయే కాంగ్రెస్,నిరుద్యోగ నిరసన ర్యాలీ కార్యక్రమంలో నియోజకవర్గ, మండల స్థాయి నిరుద్యోగులు,విద్యార్థులు,విద్యార్థిసంఘాల ప్రతినిధులు పాల్గొని, యువకులకు తోడ్పాటుగా, భరోసాగా ఈ మహోన్నతమైన కార్యక్రమానికి వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయగలరని మండల కాంగ్రెస్ యంత్రాంగం తరపున విజ్ఞప్తి చేస్తున్నాం.
ఈ కార్యక్రమంలో
మండల అధ్యక్షుడు ధూగ్గెంపూడి కృష్ణారెడ్డి, టీపీసీసీ సభ్యులు చందా సంతోష్, జిల్లా మైనారిటీ అధ్యక్షులు మొహమ్మద్ ఖాన్, నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు బట్టా విజయ్ గాంధీ, కణితి కృష్ణ,మాజీ మండల అధ్యక్షులు పూలపెళ్లి సుధాకర్ రెడ్డి, బెల్లంకొండ వాసుదేవరావు, యువనాయకులు, న్యాయవాది భజన సతీష్ కుమార్, చల్లా వెంకటనారాయణ, గద్దల వీరయ్య, సారపాక టౌన్ ప్రెసిడెంట్ ఎల్లంకి రాము, పార్టీ సీనియర్ నాయకులు, పెద్దలు బొర్రా భద్రయ్య , మండల కమిటీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ సోషల్ మీడియా సభ్యులు ముర్రం రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking