రైతుల మేలుకే ధాన్యం కొనుగోలు కేంద్రం ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

రైతుల మేలుకే ధాన్యం కొనుగోలు కేంద్రం

ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

చౌటుప్పల్, అక్షిత ప్రతినిధి :

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చౌటుప్పల్ ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసినటువంటి వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను మునుగోడు శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ అధ్యక్షులు చింతల దామోదర్ రెడ్డి ప్రారంభించారు. రైతుల తమ ధాన్యాన్ని కల్లాల వద్దనే శుభ్రపరచుకొని మార్కెట్ కు తీసుకొని రావాలని తెలియజేశారు. కొనుగోలు కేంద్రాలలోనే అమ్మి ప్రభుత్వం మద్దతు ధర పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం, కౌన్సిలర్లు లింగస్వామి, సైదులు, శైలజ, రాజు, నాగరాజు, మల్లేష్, సంఘ ఉపాధ్యక్షులు చెన్నగోని అంజయ్య గౌడ్, డైరెక్టర్లు రూపమ్మ, పబ్బతి వెంకటేష్, శ్రీశైలం, శశిధర్ రెడ్డి, బాలరాజు, వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ బొడ్డు శ్రీనివాసరెడ్డి, మండల అగ్రికల్చర్ ఆఫీసర్ నాగరాజు, కార్యదర్శి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking