యోగ, ధ్యానం శిక్షణ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి

యోగ, ధ్యానం శిక్షణ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి

మందమర్రి, అక్షిత ప్రతినిధి:-

పట్టణంలోని సిఈఆర్ క్లబ్ నందు సింగరేణి ఆధ్వర్యంలో హార్ట్ ఫుల్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఉచితంగా నిర్వహిస్తున్న యోగా, ధ్యానం, మానసిక ఆరోగ్య అవగాహన శిక్షణ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఏరియా జిఎం జి మోహన్ రెడ్డి కోరారు. కేంద్ర, రాష్ట్ర సాంస్కృతి మంత్రిత్వ శాఖ, శ్రీ రామచంద్ర మిషన్, హార్ట్ ఫుల్ నేస్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యోగ, ధ్యాన శిక్షణ కార్యక్రమానికి శనివారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై, జ్యోతి ప్రజ్వల చేసి, కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి హృదయం ధ్యానం చేయాలి, ప్రతిరోజు ధ్యానం చేయాలనే నినాదంతో ఆసనాలు, ప్రాణాయామం, ముద్రలు తదితర కార్యక్రమాలు దేశవ్యాప్తంగా హార్ట్ ఫుల్ నెస్ ఇన్స్టిట్యూట్ ఆద్వర్యంలో అందిస్తున్నారని తెలిపారు. యోగ అపారమైన ప్రయోజనం అనుభూతి చెందాడానికి, ప్రతి ఒక్కరికి అరుదైన, ప్రత్యేకమైన ఆసనం నుండి ధ్యానం వరకు, శాంతి, ఆనందం, ఉన్నత శ్రేయస్సు పొందడానికి శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా యోగా, ధ్యానంతో పాటు కళ్ళకు గంతలు కట్టుకుని రంగులను గుర్తించే బ్రైటర్ మైండ్ అనే కార్యక్రమాన్ని చిన్నపిల్లలతో చేయించారు. అనంతరం నిర్వాహకులు ఏరియా జిఎం జి మోహన్ రెడ్డిని శాలువతో ఘనంగా సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ కార్యక్రమంలో టిబిజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్, ఏఐటియుసి బ్రాంచ్ సత్యనారాయణ శైలేంద్ర సత్యనారాయణ, ఏరియా పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్, సీనియర్ పిఒ లు సత్యబోస్, మైత్రేయ బందు, హార్ట్ ఫుల్ ఇనిస్టిట్యూట్, రామచంద్ర మిషన్ కోఆర్డినేటర్ కె అనిల్ కుమార్, శిక్షకులు సిహెచ్ ప్రవీణ, ఎం చిరంజీవి, కే కోమల్, టి శ్రీధర్, యోగ శిక్షకుడు శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking