నిరుపేద కుటుంబానికి జి ఎస్ ఆర్ ఫౌండేషన్ చేయూత
మందమర్రి, అక్షిత ప్రతినిధి:-
పట్టణంలోని శ్రీపతి నగర్ కు చెందిన నిరుపేద మూగల అరుణ, ఆమె కుమార్తె సింధూజ లు చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి, నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి జిఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేయుతనందించారు.ఈ సందర్భంగా ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ రాజా రమేష్ బాబు తన జన్మదినాన్ని పురస్కరించుకొని శనివారం వారికి 25 కిలోల బియ్యం, కొంత ఆర్థిక సహాయం అందజేస్తూ, ఆమె కుమార్తె సింధూజ చదువులకు భవిష్యత్తులో తోడుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సేవా కార్యక్రమం చేస్తున్న వారికి, సేవ భావం ఉన్నవారికి మాత్రమే సేవా అంటే ఏంటో తెలుస్తుందని, ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా చేసేదాన్ని సేవా అంటారని తెలిపారు. అటువంటి వారిని కొంతమంది అజ్ఞానంతో విమర్శించడం వారి వివేకానికి వదిలేస్తున్నామన్నారు.సేవ దృక్పథంతో సేవా కార్యక్రమం చేస్తున్న వారిని చులకనగా మాట్లాడడం తగదని, సేవ చేయడం వెనక ఎంత కష్ట ఉంటుందో అది కష్టపడి సంపాదించి, ఇతరులకు సహాయం అందించడంలో తెలుస్తుందన్నారు. ఆపదలోని, నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి సహాయం చేయడం కోసం మాత్రమే ఫౌండేషన్లు, ట్రస్టులు ఏర్పడతాయే తప్ప వేరే వాటి కోసం కాదన్నారు. కొంతమంది తన తల్లి పేరు, తండ్రి పేరు మీద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారని, తాను సైతం తన అక్కయ్య పేరుమీద జిఎస్ఆర్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి, గత 23 సంవత్సరాలుగా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం తన అదృష్టంగా భావిస్తున్నానని స్పష్టం చేశారు. ఎవరు ఎంత చులకనగా చూసినా, ఎన్ని ఆరోపణలు చేసిన ఆపదలో ఉన్నవారికి జిఎస్ఆర్ ఫౌండేషన్ కచ్చితంగా ముందుండి సేవ అందిస్తుందని స్పష్ట చేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ మందమర్రి సభ్యులు పొన్నం హరీష్, గడల రమేష్, రవి, తేజ, కిషోర్, శ్రావణ్, జిఎస్ఆర్ ఫౌండేషన్ ఉపాధ్యక్షులు అకినపల్లి సురేష్, సభ్యులు కిరణ్ కుమార్, ఉప్పులపు సురేష్, భూతగడ్డ రమేష్, పప్పు రాజు, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.