ముస్లిమ్ సోదరుల కీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన కార్పొరేటర్
శేరిలింగంపల్లి అక్షిత ప్రతినిధి..
పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని తారనగర్, లింగంపల్లి, గచ్చిబౌలి విలేజ్ స్ట్రీట్ నెం. 1, చందానగర్, హఫీజ్ పెట్ వివిధ ప్రాంతలలో తదితర ముస్లిం శ్రేయోభిలాషుల ఆధ్వర్యంలో నిర్వహించిన రంజాన్ ఈద్ మిలాప్ కార్యకమంలో ముఖ్య అతిధిలుగా శేరిలింగంపల్లి కార్పొరేటర్, జి ఎచ్ ఎం సి స్టాండింగ్ కమిటీ మెంబర్ రాగం నాగేందర్ యాదవ్ తెలిపిన కార్పొరేటర్ పాల్గొని ముస్లిం సోదర సోదరిమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ సహనాన్ని, దానదయ గుణాన్ని, సోదరభావాన్ని, శాంతి సామారస్యాలను పెంపొందించే పవిత్ర పర్వదినం రంజాన్ ని ఆనందంగా జరుపుకోవాలని అన్నారు.
*అదేవిధంగా ముస్లిం మైనారిటీ అభివృద్ధి కోసం అమలు చేస్తున్న పలు పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని, వారి అభివృద్ధి సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని కార్పొరేటర్ తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు వీరేశం గౌడ్, సీనియర్ నాయకులుమిరియాల రాఘవ రావు, హబీబ్ భాయ్, సయ్యద్ నయీమ్, మహాముద్, అజ్జు, లడ్డు, రాజు, మహేష్ ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు.*