రంజాన్ పండుగ ప్రజా జీవితాల్లో సుఖః సంతోషాలను అందించాలి. డా. సత్యం శ్రీరంగం.
కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి:
క్రమ శిక్షణ, ధార్మిక చింతన, దాతృత్వం కలయిక రంజాన్ పండుగ ప్రత్యేకత పవిత్ర రంజాన్ పర్వదిన సందర్బంగా రాష్ట్ర యూత్ కాంగ్రెస్ నాయకులు ఎండీ మొయిజ్, మూసాపేట డివిజన్ అధ్యక్షులు చున్ను పాషా, అల్లాపూర్ డివిజన్ సేవాదళ్ నాయకులు వాజీద్, మైనార్టీ నాయకులు మొయినుద్దీన్, ఓల్డ్ బోయిన్ పల్లి డివిజన్ యూత్ కాంగ్రెస్ నాయకులు మొయిజ్ నివాసాలలో వారిని, వారి కుటుంబ సభ్యులను కలిసి శుభాకాంక్షలు తెలియచేసిన పీసీసీ సభ్యులు డా. సత్యం శ్రీరంగం. ఈ సందర్బంగా సత్యం శ్రీరంగం మాట్లాడుతూ పవిత్ర రంజాన్ పండుగ వేడుకలను ముస్లింలు అందరూ కుటుంబ సభ్యులతో, బంధు మిత్రులతో ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని అన్నారు. ఈ రంజాన్ మీకు శాశ్వతమైన శాంతి, ఆనందాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నానన్నారు.రంజాన్ మాసం చాలా పవిత్రమైనదని, నిష్ఠతో చేసే ఉపవాస ప్రార్థనలతో మత సామరస్యం, శాంతి సౌబ్రాతృత్వం వెల్లివిరియాలని అన్నారు. ఒకరికొకరు పరస్పరం సహకరించుకుంటూ, ఒకరి మతాలను ఒకరు గౌరవించుకుంటూ, పండుగ వేడుకలను కలిసి మెలిసి ఘనంగా జరుపుకోవాలని సూచించారు. అల్లా దీవెనలతో ప్రజలంతా కలిసి మెలిసి సుఖః సంతోషాలతో జీవించేలా భగవంతుని ఆశీర్వాదం అందాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో నల్లోల రాజేందర్, శామ్యూల్, తూము వేణు, నర్సింహా యాదవ్, మల్లేష్ యాదవ్, మట్టే ప్రసన్న కుమార్, గజానంద్ శేఖర్, నజీర్ తదితరులు పాల్గొన్నారు.