బండి సంజయ్ చిత్రపటానికి క్షీరాభిషేకం

బండి సంజయ్ చిత్రపటానికి క్షీరాభిషేకం

చేర్యాల,ఏప్రిల్ 22 అక్షిత ప్రతినిధి:
కొమురవెల్లి మండల కేంద్రంలో శనివారం బిజెపి సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి బూరుగు సురేష్ గౌడ్ ఆధ్వర్యంలో కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి ముఖ ద్వారం వద్ద భారత ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేయడం జరిగింది.ఈ సందర్భంగా సురేష్ గౌడ్ మాట్లాడుతూ ప్రజల మేలు కోసం కొమురవెల్లిలో రైల్వేఆల్టింగ్ ఏర్పాటుకు కృషిచేసిన ఘనత బండి సంజయ్ కే దక్కిందని,ఈ శుభ సందర్భంగా ముందుగా బండి సంజయ్ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుతూ మల్లికార్జున స్వామి ఆలయంలో అర్చన చేయించి, పాలాభిషేకం చేయడం జరిగిందని అన్నారు.అనంతరం స్వీట్లను పంపిణీ చేసి బాణసంచా కాల్చడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో కొమరవెల్లి మండల నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking