స్నేహ సుగంధం వెదజల్లిన మిత్రుడి వివాహ వేడుక
చిన్నంబావి, అక్షిత న్యూస్:
చిన్నంబావి మండలంలోని దగడపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2010–11 విద్యా సంవత్సరానికి చెందిన పదో తరగతి క్లాస్మేట్స్ పాఠశాల రోజుల్లో ఏర్పడిన స్నేహబంధం కాలగమనంలోనూ చెక్కుచెదరదని చాటి చెప్పారు. తమ సహాధ్యాయి సుధాకర్ వివాహ వేడుకకు కుటుంబ సభ్యులతో కలిసి హాజరై నూతన వధూవరులు సుధాకర్–సాహితిలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎన్నో ఏళ్ల తర్వాత ఒకేచోట కలుసుకున్న క్లాస్మేట్స్ పాఠశాల రోజుల మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆప్యాయంగా ముచ్చటించారు. స్నేహబంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటూ ఆనందోత్సాహాల మధ్య వివాహ వేడుకలో సందడి చేశారు.ఈ సందర్భంగా క్లాస్మేట్స్ మాట్లాడుతూ.. స్నేహం అనేది పాఠశాల గడపతో ముగిసిపోయేది కాదు. జీవితాంతం కొనసాగాల్సిన అనుబంధం. మా బ్యాచ్‌లో ఎవరి ఇంట్లో శుభకార్యం జరిగినా అందరం కలిసి హాజరై వారి ఆనందంలో భాగస్వాములవుతున్నాం. క్లాస్మేట్స్ అంటే ఒకే బ్యాచ్‌కు చెందినవారు మాత్రమే కాదు.. ఒకే కుటుంబ సభ్యుల్లా కష్టసుఖాల్లో తోడుండే ఆత్మీయులే అన్ని అన్నారు.ఈ కార్యక్రమంలో వినోద్, శివ, శ్రీకాంత్, ప్రేమ్, నిరంజన్, నరేష్, కిరణ్, రాఘవేందర్, మద్దిలేటి, అనిత, మంజుల, సునీత, శ్రీవాణి, గోవింద, శ్యామలతో పాటు పలువురు క్లాస్మేట్స్ పాల్గొని నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు.